రజక వృత్తిదారుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికీ తీసుకెళ్లి పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

  • మారుతున్న కాలానికి అనుగుణంగా కుల వృత్తులు మారాలి
  • వృత్తి చేసుకునే వారికి ప్రతి నియోజకవర్గానికి ఒక అధునాతన మోడర్న్ దోభిఘాట్ నిర్మించడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం..
  • ఎలాంటి ఆటంకాలు లేకుండా రజక వృత్తదారులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం
  • రజక వృత్తిదారుల అభివృద్ధిపై సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్

బలహీన వర్గాల్లో కుల వృత్తుల ఆధారపడే కులాలు మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆర్థిక వృద్ధి సాధించేలా కుల వృత్తులు ఎదగాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో షాద్ నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో రజక వృత్తిదారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ రజక వృత్తిదారుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాయి బ్రాహ్మణ సెలూన్ లు బ్యూటీపార్లర్ లుగా, రజక దోభిఘాట్ లు అధునాతన డ్రైక్లినింగ్ లుగా మారినప్పుడే వృత్తికి సార్థకంగా మారుతుందని అప్పుడే వృత్తిదారులు ఆర్థికంగా ఎదుగుతారని మంతి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

హైదరాబాద్ నగరంలో రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తో మాట్లాడి వారి సమస్యల పై ఆరా తీశారు. త్వరలోనే 9 మోడర్న్ డోబిఘాట్ లు రాబోతున్నాయని , రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 మోడర్న్ దోభిఘాట్ లు ఏర్పాటు చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నగరంలో 12 ధోబిఘాట్ లకు ఏర్పడిన సమస్యలు మరమత్తులు చేసేలా కార్యచరణ తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాలువలు , చెరువులు ఇతర ప్రాంతాల్లో వృత్తి కొనసాగుతుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న బేగంపేట ధోబుఘాట్ పై రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్య పై ఆరా తీశారు. చాలా జిల్లాల్లో రజక వృత్తిదారులకు కేటాయించిన భూమిపై వస్తున్న ఇబ్బందులు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు ,కలెక్టర్ లు సమన్వయం చేసుకుని పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నాయి బ్రాహ్మణ సెలూన్ లకు, రజక వృత్తిదారులకు ఇస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నామని తెలిపారు. సమీక్షా సమావేశంలో షాద్ నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయదేవి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, ఆర్డీవో, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, రజక వృత్తిదారుల సంఘం నేతలు