ఏపీలో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ కేసులు గుంటూరు- 14, కర్నూలు-5 ప్రకాశం-1 కడప-1 ఒక్కొక్క కేసు నమోదైనట్టు ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ లో వెల్లడించింది. దీంతో ఎపిలో కరోనా కేసుల సంఖ్య 402 చేరుకున్నాయి. ఇప్పటివరకు కోవిడ్ 19తో ఆరుగురు చనిపోగా..  22మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 24గంటల్లో 909 పరీక్షల్లో 37 పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. కర్నూలులో అత్యధికంగా 82 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎపిలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.