మోత్కూర్ గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో శనివారం అర్ధరాత్రి  2 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. మంటల్లో పాఠశాల ఫర్నిచర్ దగ్ధమైంది. పాఠశాలలో మంటలు చెలరేగడాన్ని గమనించిన కాలనీ వాసులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో హూటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అర్పివేశారు. లాక్ డౌన్ తో పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదంలో పాఠశాల ఫర్నీచర్ తోపాటు విద్యార్థుల సామాగ్రి, వంట సామాగ్రి దగ్దమయ్యాయి.