
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండటం, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటం లాంటి పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎంసెట్ సహా రాష్ట్రంలో మే నెలలో జరుగాల్సిన అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కొత్త తేదీలను ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. కాగా, ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు మే 5 వరకు గడువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.