తెలంగాణలో 30 వరకు కోర్టులు బంద్‌

తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థలోనూ ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగిస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని జిల్లా, దిగువ కోర్టులు, ట్రిబ్యునళ్లు, రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, మీడియేషన్‌, ఆర్బిట్రేషన్‌ సెంటర్‌, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ, రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ తదితర వ్యవస్థలన్నీ పనిచేయవని ఉత్తర్వులో పేర్కొన్నది. హైకోర్టు సైతం జ్యుడీషియల్‌, అడ్మినిస్ట్రేషన్‌ వర్క్‌ను ఈ నెల 30 వరకు వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. అత్యవసరమైన బెయిల్‌, స్టే వ్యవహారాలు, అత్యవసర ప్రజాప్రయోజన వ్యాజ్యాలను మాత్రమే హైకోర్టు విచారణకు స్వీకరిస్తుందని వివరించారు.