
ఆంధ్రప్రదేశ్‌లో మరో 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 473కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. గుంటూరు(16), కృష్ణా(8), కర్నూలు(7), అనంతపురం(2), నెల్లూరు(1) జిల్లాలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 450గా ఉంది. అత్యధికంగా గుంటూరు(109), కర్నూలు(91), నెల్లూరు(56), ప్రకాశం(42), కృష్ణా(44), కడప(31), చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 23 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.