భారత్‌లో 10వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,363కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కరోనా హెల్త్‌బులెటిన్‌ను కేంద్రం విడుదల చేసింది. ఇవాళ కొత్తగా 1,211 కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనాతో 31 మంది మృతిచెందారు. ప్రస్తుతం 8,988  మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 

మంగళవారం మధ్యాహ్నం వరకు  దేశంలో 339 మంది కోవిడ్‌-19 బారిన పడి చనిపోయారు. కరోనా నుంచి కోలుకొని ఇప్పటి వరకు 1035 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇవాళ ఒక్కరోజే 117 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.  వచ్చే 6 వారాలకు సరిపడే టెస్టింగ్‌ కిట్లు ఉన్నాయని కేంద్రం తెలిపింది.  దేశవ్యాప్తంగా 166 ప్రభుత్వ, 70 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో టెస్టింగ్‌ ల్యాబ్స్‌  ఏర్పాటు చేశామని వెల్లడించింది.  భారత్‌లో ఇప్పటి వరకు 2,31,902 శాంపిల్స్‌ టెస్టు చేశామని.. నిన్న ఒక్కరోజే 21,635 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వివరించింది.