
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య బుధవారంనాటికి 20 లక్షలు దాటింది. వీటిలో సగానికిపైగా కేసులు ఐరోపా దేశాల్లోనే నమోదయ్యాయి. ఇప్పటివరకూ ప్రపంచంలో 20,44,221 మందికి వైరస్ సోకగా, వీరిలో 1,31,340 మంది మృత్యువాతపడ్డారు. ఐరోపా దేశాల్లో 10,10,858 మందికి కొవిడ్-19 సోకగా, 85,271 మంది మరణించారు. మిగతా దేశాలతో పోలిస్తే, అమెరికాలో కరోనా వేగం గా విస్తరిస్తున్నది. అక్కడ 6,22,380 కేసులు నమోదు కాగా 27,548 మంది మరణించారు. కాగా గతేడాది డిసెంబర్ 31న చైనాలోని వుహాన్ నగరంలో తొలి వైరస్ కేసు నమోదైంది. తొలి ఐదు లక్షల కరోనా కేసులు నమోదవ్వడానికి గరిష్ఠంగా 88 రోజుల సమయం పట్టగా.. ప్రస్తుతం రోజుకు సగటున 70 వేల నుంచి 80 వేల కొవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి.