
కరోనాతో భూమిపై నివసించే మానవాళితో పాటు మూగ జీవాలు కూడా విలవిలలాడుతున్నాయి. తాము తినేందుకే తిండి దొరక్క ఇబ్బందులు పడున్న ఈ పరిస్థితులలో జంతువులకి ఏం పెట్టాలని కొందరు వాపోతున్నారు. మరి కొందరు జంతువుల నుండి కరోనా వ్యాప్తి చెందుతుందన్న భయంతో మొన్నటి వరకు అపురూపంగా చూసుకున్న వాటిని వీధుల్లోకి తరిమేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు మూగజీవాలకి మన వంతు సాయం చేయాలని కోరుతున్నారు.
ఇప్పటికే వెంకటేష్, అమల, పరిణితీ చోప్రా వంటి వారు మనతో సమానమైన జంతువులను ప్రేమించాల్సిన సమయం ఇదే. దయచేసి వాటికి కొంత సమయం కేటాయించండని చెబుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా.. ప్రపంచం మొత్తం కోవిడ్ 19తో విలవిలలాడుతున్న ఈ పరిస్థితులలో మూగ జీవాలని మనం మరచిపోకూడదు. మన ఇంటి చుట్టు పక్కల ఉండే జంతువులపై దయ చూపుదాం అంటూ జంతు సేవా సంస్థకి తోచినంత విరాళం అందించాలని కోరారు.