స‌జ్జ‌నార్‌ని క‌లిసి మాస్క్‌లు అందించిన జ‌గ‌ప‌తి బాబు

క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా లాక్‌డౌన్‌ని ప‌క‌డ్భందీగా నిర్వ‌హిస్తున్న పోలీసుల‌కి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు మాస్క్‌లు, శానిటైజ‌ర్స్ అందిస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ‌ధ్య నిఖిల్ అందించ‌గా, నిన్న  సినీ నిర్మాత దిల్‌రాజు పోలీస్‌ సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్‌లు అందజేశారు. తాజాగా విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ వి.సి.సజ్జనార్‌ను కలిసి ఎన్‌–95 మాస్కులు, శానిటైజర్లను అందించారు. విప‌త్క‌ర కాలంలో  విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ముందు జాగ్రత్తగా వీటిని అందించినట్లు జగపతిబాబు పేర్కొన్నారు.