భారత్‌లో 24 గంటల్లో 43 మంది మృతి

భారత్‌లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కరోనా వైరస్‌ విస్తరించింది. కరోనా వైరస్‌ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 43, కాగా 991 కొత్త కేసులు నమోదు అయ్యాయి. భారత్‌లో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 14,378కు చేరుకోగా, మరణాల సంఖ్య 480కి చేరింది. ఈ వైరస్‌ బారి నుంచి 1991 మంది కోలుకున్నారు.