ఖమ్మం – సూర్యపేట జిల్లాల సరిహద్దులు మూసివేత

సూర్యపేట జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో సూర్యపేట – ఖమ్మం జిల్లాల సరిహద్దులో అధికారులు అప్రమత్తమయ్యారు. కూసుమంచి మండలంలోని జిల్లా సరిహద్దును మూసివేశారు. సూర్యపేటకు అనుసంధానమైన లింక్‌రోడ్లను మూసివేశారు. నాయకన్‌గూడెం, రాజుపేట, జక్కెపల్లిలో సూర్యపేట జిల్లా అనుసంధాన రోడ్లపై కాపాల ఏర్పాటు చేశారు. సూర్యపేట జిల్లా ప్రజలు ఎవరూ ఖమ్మం రావొద్దని విజ్ఞప్తి చేశారు. స్థానిక సర్పంచ్‌లను పోలీసులు అప్రమత్తం చేశారు. గ్రామాల్లోకి ఎవరూ రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.