
శనివారం నాటికి కరోనా వైరస్ మహమ్మారి వల్ల మరణించిన వారి సంఖ్య 1,54,188కి చేరిందని ఎఎఫ్‌పి సంస్థ అధికారిక వర్గాల ద్వారా సేకరించిన వివరాల వల్ల తెలిసింది. డిసెంబర్లో చైనా వుహాన్ పట్టణంలో ఈ వ్యాధి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 193 దేశాలు, ప్రాంతాల్లో 22,51,690 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,97,600 మందికి చికిత్స అనంతరం వ్యాధి నయమైంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్లూహెచ్ఓ) నుంచి, నేషనల్ అథారిటీస్‌ను ఎఎఫ్‌పి ఈ వివరాలు సేకరించింది. చాలాదేశాలు తీవ్రత ఉన్న కరోనా కేసుల్ని మాత్రమే పరీక్షిస్తున్నాయి. ప్రస్తుతం కరోనాకు కేంద్రస్థానంగా మారిన అమెరికాలో 7,06,779 కోవిడ్ 19 కేసులు నమోదు కాగా, 37,079 మంది మరణించారు.
59,672 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కరోనా మరణాల్లో ఇటలీ రెండో స్థానంలో ఉంది. అక్కడ 22,745 మంది మరణించగా, 1,72,434 మందికి వ్యాధి సోకింది. కోవిడ్ 19 విషయంలో స్పెయిన్ మూడో స్థానంలో ఉంది. ఈ దేశంలో 20,043 మంది చనిపోగా, 1,91,726 మందికి వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది. ఫ్రాన్‌లో 18,681మంది కరోనా వల్ల మరణించారు. 1,47,969 మందికి వ్యాధిసోకింది. బ్రిటన్‌లో 14,576 మంది మృతి చెందగా 1,08,692 మంది కరోనాకు గురయ్యారు. హాంకాంగ్, మకావూల్ని మినహాయించి చైనాలో ఇప్పటివరకూ 4,632 మంది మరణించారు. 82,719 మందిలో పాజిటివ్ వచ్చింది.
యూరప్‌లో…
ఇక యూరప్‌లో మొత్తం 11,15,555 మందికి కరోనా సోకగా ఇంతవరకూ 97,985 మంది మరణించారు. అమెరికా, కెనడాల్లో కలిపి 7,38,706 కేసులు రిజిస్టర్ కాగా, 38,445 మంది మరణించారు. ఆసియాలో 1,58, 764 పాజిటివ్ కేసులు, 6,837 మరణాలు నమోదయ్యాయి. మధ్య ప్రాచ్యంలో 1,19,462 ఈ వైరస్ కేసులు వెలుగు చూడగా, 5,452 మంది చనిపోయారు. లాటిన్ అమెరికా, కరీబియన్‌లో 91,699 కేసులు, 4,367 మరణాలు, ఆఫ్రికాలో 19,674 కేసులు, 1,016 మరణాలు, ఓసినియాలో 7,835 కేసులు, 86 మరణాలు నమోదయ్యాయి.