తెలంగాణలో ఈ రోజు కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం కేసులు 809 కాగా ప్రస్తుతం యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 605కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు ఆస్పత్రి నుంచి చికిత్స పొంది 186 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌ 19 వైరస్‌ బారిన పడి 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ రోజు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలో 31 కొత్త కేసులు నమోదు కాగా, గద్వాల జోగులాంబ జిల్లాలో 7, సిరిసిల్లలో 2, రంగారెడ్డిలో 2, నల్లగొండ జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి.