లాక్‌డౌన్ వలన ప్రజలు ఇళ్ళ నుండి బయటకి రావడం లేదు. అత్యవసర పరిస్థితులలో రక్తదానం చేసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని బ్లండ్ బ్యాంకులు మీడియా ముఖంగా రక్తదానం చేసేందుకు రావాలని కోరుకుంటున్నాయి. రీసెంట్‌గా నేచురల్ స్టార్ నాని ముందుకు వచ్చి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్‌బ్యాంక్‌కు వెళ్లి రక్తదానం చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ..చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశారు.
అందరం ఇళ్లల్లో ఉండడం వలన రోగులకి రక్తం అందక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లల్లు తలసీమియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్లకు నెలకు రెండు సార్లు రక్తం ఎక్కించాల్సిన ఉంటుంది. దాంతో పాటు ఇతర ఆపరేషన్స్‌కు రక్తం అనేది చాలా అవసరం. కరోనా కారణంగా ఏర్పడిన భయం వల్ల చాలా మంది రక్తదానం చేయడానికి ముందుకురాలేకపోతున్నారు. వారిలో అవగాహన కల్పించేందుకు ఇలా సెలబ్రిటీలు ముందుకు వస్తుండడం హర్షించదగ్గ విషయం.