
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీస్ దెబ్బలు తాళలేక ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మెడికల్ షాపులో ఔషధాల కోసం వచ్చిన ఒక యువకుడిని సత్తెనపల్లి చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ దెబ్బలు తాళలేక యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, మందుల కోసం పోయిన తన బిడ్డను పోలీసులు కొట్టి చంపారని యువకుడి తండ్రి ఆరోపించారు. పోలీసుల తీరుపై సత్తెనపల్లి పట్టణ వాసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.