భారత్‌లో 24 గంటల వ్యవధిలో మరో 1,553 కరోనా పాజిటివ్ కేసులు

మన దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,553 కేసులు నమోదు కాగా, 36 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కేంద్రం హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది.  ‘దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 17,265కు పెరిగింది. ప్రస్తుతం భారత్‌లో 14,175 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు వైరస్‌ నుంచి కోలుకొని 2,546 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  కరోనా సోకి ఇప్పటి వరకు 543 మంది మృతి చెందారు. గోవా ఇప్పుడు కరోనా రహిత రాష్ట్రంగా నిలిచింది. గత 14 రోజుల్లో దేశంలోని 59 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదని’  ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్ తెలిపారు.