ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఏపీలో గత 24 గంటల్లో 75 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 722కు చేరగా.. ఇప్పటి వరకు 20 మంది కరోనా బారిన పడి మృతి చెెందారు. ప్రస్తుతం 610 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, కరోనా నుంచి కోలుకొని 92 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 17,545 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 567 మంది మరణించారు.