దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 21 వేలు దాటాయి. ఈ సంఖ్య 21,359కి చేరుకున్నది. కొత్తగా 1,486 కేసులు నమోదుకాగా 49 మంది మరణించారు. దీంతో మరణించిన వారి సంఖ్య 685కి చేరుకున్నది. దేశంలో ప్రస్తుతం 16,507 యాక్టివ్ కేసులున్నాయని, ఇప్పటి వరకు 4,103 మంది డిశ్చార్జి అయ్యారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. మహారాష్ర్టలో 5,649 కేసులు నమోదవ్వగా 269 మంది చనిపోయారు. గుజరాత్‌లో 2,407 మందికి వైరస్ సోకగా 103 మంది మరణించారు. వెయ్యికి పైగా కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఢిల్లీ (2248), రాజస్థాన్ (1868), తమిళనాడు (1629), మధ్యప్రదేశ్ (1587), ఉత్తర్‌ప్రదేశ్ (1449) ఉన్నాయి.