5 నెల‌ల పాటు 6 రోజుల జీతం క‌ట్‌ – కేర‌ళ ప్ర‌భుత్వం

కేర‌ళ ప్ర‌భుత్వం జీతం కోత‌ల‌పై నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ప్ర‌తి నెలా.. అయిదు నెల‌ల పాటు ప్ర‌భుత్వ ఉద్యోగుల నుంచి ఆరు రోజుల జీతాన్ని కోత విధించ‌నున్న‌ట్లు సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తెలిపారు.  కోవిడ్‌19 వ‌ల్ల ఎదుర‌య్యే ఆర్థిక సంక్షోభాన్ని త‌ట్టుకునే విధంగా ఉద్యోగుల జీతాల‌కు తాత్కాలికంగా కోత విధించ‌నున్న‌ట్లు చెప్పారు.  ప్ర‌భుత్వ రంగ యూనిట్లు, ఎయిడెడ్‌, క్వాసి గ‌వ‌ర్న‌మెంట్ సంస్థ‌ల‌కు కూడా ఈ కోత వ‌ర్తిస్తుంద‌న్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ బోర్డుల స‌భ్యులు త‌మ నెల జీతంలో 30 శాతాన్ని కోవిడ్ ఫండ్‌కు ఏడాది పాటు ఇవ్వ‌నున్న‌ట్లు సీఎం విజ‌య‌న్ తెలిపారు.