దేశంలో కరోనా కేసుల సంఖ్య 24,506కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడిన 779 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 18,668 యాక్టివ్ కేసులు ఉండగా, 5192 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 6817కు కరోనా కేసులు నమోదవగా, 301 మంది మరణించారు. గుజరాత్‌లో 2,815 మంది ఈ వైరస్ బారిన పడగా, 127 మంది మరణించారు. దేశరాజధాని ఢిల్లీలో 2514 కేసులు నమోదవగా, 53 మంది మృతిచెందారు.
రాజస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య 2034కు చేరింది. ఇప్పటివరకు 27 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో 1852 మంది ఈ వైరస్ బారిన పడగా, 92 మంది మృతిచెందారు. తమిళనాడులో 1755 కరోనా కేసులు నమోదవగా, అందులో 31 మంది పదేండ్లలోపు చిన్నారులు ఉన్నారు. ఇప్పటివరకు 22 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 955కి చేరింది. ఇప్పటివరకు 29 మంది మరణించారు.