దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు శనివారం కూడా భారీ సంఖ్యలో నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 24,942కు, మొత్తం మరణాల సంఖ్య 779కు చేరుకుంది. యాక్టివ్ కరోనా కేసులు 18,953 కాగా.. 5210 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
కేరళలో కొత్తగా 7 పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసుల సంఖ్య 457కు చేరింది. మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 394 కొత్త కేసులు నమోదు కాగా..18 మంది మరణించారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 6817కు, మృతుల సంఖ్య 301కు పెరిగింది.