దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 26 వేల 283కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,519. కోవిడ్-19 వ్యాధి కారణంగా ఇప్పటివరకు 825 మంది చనిపోయారు. వ్యాధి నుంచి 5,939 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా 7,628 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1076 మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అదే గుజరాత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3071కు చేరుకుంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2,625గా నమోదైంది.