టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటేందుకు పలువురు ప్రముఖులు ఉత్సాహం చూపుతున్నారు. ప్రజాప్రతినిధులు, మేధావులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారు మొక్కలు నాటడమే కాకుండా.. ఇతరుల చేత మొక్కలు నాటించి విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

తాజాగా హాస్య నటుడు అలీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ప్రముఖ మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి విసిరిన ఛాలెంజ్‌ను బక్రీద్ పర్వదినం సందర్భంగా స్వీకరించి.. మణికొండలోని తన ఇంట్లో మొక్కలు నాటారు అలీ. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగడం సంతోషంగా ఉందని అలీ అన్నారు. అనంతరం మరో ఇద్దరు (సోదరుడు సినీ ఆర్టిస్ట్ ఖయుమ్, బావమరిది కరీం) గ్రీన్ ఛాలెంజ్ విసురుతూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.