రాజ్య‌స‌భ ఎంపీ, మాజీ మంత్రి అమ‌ర్‌సింగ్ క‌న్నుమూత‌

రాజ్య‌స‌భ ఎంపీ, మాజీ మంత్రి, సామాజ్‌వాదీ పార్టీ మాజీ నాయ‌కుడు అమ‌ర్‌సింగ్ క‌న్నుమూశారు. అనారోగ్యం కార‌ణంగా ఆయ‌న గ‌త కొన్ని నెల‌లుగా సింగ‌పూర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో నేడు మృతిచెందారు. అమ‌ర్‌సింగ్‌కు భార్య పంకజా కుమారీ సింగ్‌, కవల కుమార్తెలు ఉన్నారు. గ‌తంలో ఓసారి 2013లో కిడ్ని వైఫ‌ల్యంతో ఆయ‌న బాధ‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. 2016లో తిరిగి రాజ‌కీయ జీవితంలోకి వ‌చ్చారు. 2020 మార్చిలో సైతం అమర్ సింగ్ మరణం గురించి పుకార్లు వెలువడినప్పుడు టైగర్ జిందా హై అని పేర్కొన్నసంగ‌తి తెలిసిందే.