మొక్క‌లు నాటిన‌ క‌రీంన‌గ‌ర్ సీపీ క‌మలాస‌న్ రెడ్డి

క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ వీబీ క‌మ‌లాస‌న్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటారు. సినీ న‌టుడు శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను సీపీ స్వీక‌రించి క‌రీంన‌గ‌ర్ క‌మిష‌న‌రేట్ ప్రాంగ‌ణంలో శ‌నివారం మొక్క‌లు నాటారు. అనంత‌రం ఆయ‌న సినీ హీరో వెంకటేష్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్, సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి లకు గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు.
ఈ సందర్భంగా కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ… భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడానికి గ్రీన్ ఛాలెంజ్ ఎంతో సహాయపడుతుందన్నారు. హ‌రిత‌హారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున మొక్క‌లు నాటాల్సిందిగా సీపీ పిలుపునిచ్చారు. ఇప్పుడు చెట్లను నాటకపోతే భవిష్యత్తులో అభివృద్ధి తాలుకు ప‌రిణామాల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌న్నారు. హ‌రిత‌హారం 6 విడత‌ల్లో క‌మిష‌న‌రేట్ ప‌రిస‌రాల్లో 50 వేల మొక్క‌లు నాటిన‌ట్లు తెలిపారు. వీటిలో 85 నుంచి 90 శాతం మొక్క‌ల‌ను బ్ర‌తికించుకునేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు.