పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం పట్టణం 8వ డివిజన్ లోని హైవే పై మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, రైతు బంధు జిల్లా కో-ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వర రావు, జిల్లా అటవీశాఖ అధికారి ప్రవీణ, టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జ్ ఆర్జేసీ కృష్ణ అధికారులు, కార్పొరేటర్లు ఉన్నారు.