తెలుగు భాష ఎంతో గొప్పది : పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్

దేశంలోని ప్రాచీన భాషల్లో తెలుగు చెప్పుకోదగిన భాష అని, 9వ శతాబ్దంలోనే గొప్ప సాహిత్యా న్ని సృష్టించిన భాష అని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నదని చెప్పారు.  తానాతోపాటు ప్రపంచంలోని 40 దేశాల్లో ఉన్న వందకుపైగా తెలుగు సంఘాలు.. తెలుగు భాషా, సంస్కృతుల పరిరక్షణకు ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహించాయి. ఈ కార్యక్రమం ముగింపులో ఆదివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆన్‌లైన్‌ ద్వారా తన సందేశాన్నిచ్చారు. ఎందరో తెలంగాణ కవులు తెలుగు భాష సాహిత్యానికి వన్నె తెచ్చారని చెప్పారు.