తెలంగాణలో కొత్త‌గా 983 మంది క‌రోనా పాజిటివ్‌లు

తెలంగాణలో క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖంప‌ట్టాయి. నిన్న 9,443 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, 983 మంది పాజిటివ్‌లుగా నిర్ధార‌ణ అయ్యారు. దీంతో తెలంగాణ‌లో మొత్తం క‌రోనా కేసులు 67,660కు చేరాయి. ఇందులో 48,609 మంది కోలుకోగా, 18,500 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 11,911 మంది బాధితులు ఐసోలేష‌న్‌లో చికిత్స పొందుతున్నారు. క‌రోనాతో నిన్న కొత్తగా 11 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు 551 మంది మృతిచెందారు. 

కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 273 కేసు‌లు జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉండ‌గా, రంగారెడ్డి జిల్లాలో 73 కేసులు ఉన్నాయి.