రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా చేవెళ్లలోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు కన్సల్టెంట్ జనరల్ సౌత్ కొరియా సురేష్ చుక్కపల్లి. తన మిత్రుడు టీఎస్‌ఎండీసీ ఎండీ మల్సూర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి, మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న వాతావరణ కాలుష్యంతో అందరం బాధపడుతున్నామన్నారు. కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పేరిట మంచి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ సందర్భంగా తన మిత్రులు శాంతా బయోటెక్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, సన్‌షైన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి, ఈఎఫ్‌ఎల్‌యూ వీసీ ప్రొఫెసర్ సురేష్‌కుమార్, వీసీహెచ్‌సీయూ ప్రొఫెసర్ అప్పారావులకు ఛాలెంజ్ విసిరి, మొక్కలు నాటాలని కోరారు.