వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం నల్లగొండలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పాఠ్యపుస్తకాల ద్వారా ఉద్యమ చరిత్రను అనతికాలంలో వెలుగులోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
