ప్రఖ్యాత స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ నేత, మాజీ మంత్రి దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాబోయేతరాలకు ఆయ న ఎప్పటికీ జ్ఞాపకం ఉంటారని చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా తెలంగాణకు ఆయన చేసిన సేవలను సీఎం కేసీఆర్ ఆదివారం స్మరించుకున్నారు. లక్ష్మణ్ బాపూజీ క్విట్ ఇండియా ఉద్యమం, నాన్ ముల్కీ ఆందోళన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తుచేసుకున్నారు.
