చైనాలో బొగ్గు గని ప్రమాదంలో 16 మంది కార్మికులు మృతి

చైనాలో బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది కార్మికులు మరణించారు. ఈ దుర్ఘటన సోమవారం తెల్లవారుజూమున కిజియాంగ్ జిల్లా చౌంగ్‌క్వింగ్‌ మున్సిపాలిటీ పరిధిలోని సాంగ్‌జౌ బొగ్గు గనిలో చోటుచేసుకుంది. రోజువారీలాగే కార్మికులు ఉదయం బొగ్గు గనిలోకి దిగారు. అయితే ప్రమాదవశాత్తూ గనిలో కార్బన్‌ మోనాక్సైడ్‌ స్థాయి పెరుగడంతో ఊపిరి ఆడక 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానిక ఇంధన సంస్థ ఈ బొగ్గుగని నిర్వహిస్తోందని జిల్లా ప్రభుత్వం తెలిపింది. 75 మంది సహాయక సిబ్బంది, 30 మంది వైద్య కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.