ఈ నెల 26న రాత్రి ఆర్టిన్ ల్యాబ్ రసాయన పరిశ్రమలో ఓ రసాయన డ్రమ్ము నుంచి వెలువడిన ఘూటైన వాయువులతో సుకాంత్ జానాతోపాటు మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన వారికి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరుసటి రోజు సుకాంత్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఒడిశాకు చెందిన కార్మికుడు సుకాంత్ జానా (40)మృతి చెందాడు. ఒడిశాకు చెందిన కార్మికుడు సుకాంత్ జానా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమాల్కాపూర్ లోని ఆర్టిన్ ల్యాబ్ రసాయన పరిశ్రమలో షిఫ్ట్ ఇంఛార్జ్ గా పనిచేస్తున్నాడు.
