అక్టోబర్ 5 నుంచి ‘జగనన్న విద్యా కానుక’

ఏపీలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ స్కూళ్ల ప్రారంభాన్ని నవంబర్ కు వాయిదా వేసింది. అక్టోబర్‌ 5న పిల్లలకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను ప్రభుత్వం అందజేసేందుకు సిద్ధమైంది. అక్టోబర్ నుంచి స్కూళ్లు ప్రారంభమవుతాయని చెప్పిన జగన్ సర్కార్ స్కూళ్ల ప్రారంభ తేదీని నవంబర్ 2కు వాయిదా వేసింది.

అయితే విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా ‘జగనన్న విద్యా కానుక’ అక్టోబర్ 5 నుంచే అమలు చేస్తామని జగన్ సర్కార్ తెలిపింది. స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సమావేశం నిర్వహించి ఈ విషయాలను వెల్లడించారు. జగనన్న విద్యాకానుక కిట్లు ముందుగానే విద్యార్థులకు అందితే పాఠశాలలు తెరిచేలోగా విద్యార్థులు యూనీఫామ్ కుట్టించుకోగలుగుతారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్కూళ్ల ప్రారంభాన్ని వాయిదా వేశామని ఆయన వెల్లడించారు.