పద్మశ్రీ డాక్టర్ శోభరాజు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అన్నమాచార్య ప్రాజెక్టు సలహాదారుగా పనిచేసిన ఆమె రెండేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. వేంకటేశ్వర స్వామి పరమ భక్తు రాలైన ఆమె అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికి శోభరాజు ఎంతో కృషి చేశారు. ‘అన్నమాచార్య భావనా వాహిని’ అనే సంస్థను ఏర్పాటు చేసి వేలాది మందిని సంగీత కళాకారులుగా తీర్చి దిద్దారు.
