టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బదిలీ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా విధులు నిర్వహిస్తున్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆయనను  ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1993 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్‌ 2017, మే నుంచి టీటీడీ ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు.  ప్రస్తుతం ఏపీ ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేఎస్‌ జవహర్‌రెడ్డిని టీటీడీ ఈవోగా నియమించనున్నట్లు సమాచారం.