రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ 75వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో దేశానికి సేవలు కొనసాగించాలని ఆశిస్తున్నాను. మీ మార్గ నిర్దేశంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
