ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అటవీశాఖ అధికారి వీ భాస్కర్ రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లలోని నాగోల్ బండ్లగూడలో ఉన్న రాజీవ్ గృహకల్ప భవనం ఐదో అంతస్తు నుంచి దూకారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రమణమూర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరించారు. ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ అధికారిగా పనిచేస్తున్నారు.
