సుప్రసిద్ధ హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య 99వ జయంతిని గురువారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కుమారుడు అల్లు అరవింద్, మనవళ్లు అల్లు అర్జున్, వెంకటేష్, శిరీష్‌లు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లు స్టూడియోస్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. సకలసదుపాయాలతో ఆధునిక సాంకేతికత మేళవించి ఈ స్టూడియో నిర్మాణాన్ని చేపడుతామని..ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తామన్నారు.
