గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంతో పచ్చదనంపెంచుతూ పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న ఎంపీ సంతోష్‌కుమార్‌కు గ్రా మోదయ బంధుమిత్ర పురస్కారం లభించిం ది. గాంధీజయంతిని పురస్కరించుకొని గురువారం గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామ ర్స్ టెక్నాలజీ (జీవోసీటీ) ప్రతినిధులు ఈ అవార్డును ప్రదానంచేశారు. ఎంపీ సంతోష్‌సేవలను ఈ సందర్భంగా జీవోసీటీ చైర్మన్ శ్యాంప్రసాద్‌రెడ్డి అభినందించారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు హరితహారంలో భాగం గా తనవంతుగా సేవచేసేందుకే గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఎంపీ సంతోష్ తెలిపారు. ఈ అవార్డును సీఎం కేసీఆర్‌కు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు.
