గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ భర్త డాక్టర్ సౌందర్ రాజన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాతో సత్కరించి సన్మానించారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్, బెస్ట్ మెడికల్ టీచర్, డాక్టర్ సౌందర్ రాజన్ కు ధన్వంతరి అవార్డు వచ్చినందుకు సీఎం కేసీఆర్ ఇవాళ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయనను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు గవర్నర్ ఆహ్వానం పలికారు.
