స్కూల్ ఆఫ్ కెమెస్ట్రీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు ఇండియన్ కెమికల్ సొసైటీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆచార్య జె.సి. ఘోష్ మెమోరియల్ అవార్డును వర్సిటీ ప్రొఫెసర్ అనునయ్ సమంతా అందుకోనుండగా ప్రొఫెసర్ సురేష్ సి. అమేటా అవార్డును ప్రొఫెసర్ కెడి సేన్ స్వీకరించనున్నారు. కెమిస్ట్స్ ఆఫ్ ఇండియన్ కెమికల్ సొసైటీ 57 వ వార్షిక సదస్సులో వీరిరువురు అవార్డులను అందుకోనున్నారు. ఇండియన్ కెమికల్ సొసైటీ (ఐసిఎస్) 1924లో ఏర్పాటైంది. రసాయన శాస్త్రవేత్తల సంఘం, దేశంలోని అనుబంధ విభాగాల సభ్యుల కోసం జాతీయ వేదికగా దీన్ని స్థాపించారు. భారతీయ రసాయన శాస్త్రవేత్తల సంఘం మొదటి అధ్యక్షుడిగా సర్ ప్రఫుల్లా చంద్ర రే పనిచేశారు.
