ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మల్కాజ్గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి అక్రమ భూఆర్జనపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రూ.70 కోట్ల మేర ఆస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు.. రెండు రోజుల క్రితం మాదాపూర్ సైబర్టవర్ల ఎదుట రూ.50 కోట్ల విలువైన భూ అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం ఎనిమిది మందిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి సేకరించిన సమాచారం, సోదాల్లో పట్టుబడిన ముఖ్యమైన పత్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు నర్సింహారెడ్డికి కోర్టు సోమవారం నుంచి నాలుగురోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. బినామీల వ్యవహారంతోపాటు ఇంకా ఎక్కడెక్కడ అక్రమాస్తులు కూడబెట్టారన్నది కస్టడీలో స్పష్టతవచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
