వైఎస్ ఆర్ సిపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు.నెల రోజుల కిత్రం ద్రోణంరాజు శ్రీనివాస్ కు కరోనా సోకగా చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం ఆయనకు నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన తీవ్ర అనాఆరోగ్యానికి గురయ్యారు. కరోనా కారణంగా అవయవాలపై ప్రభావం చూపడంతో ఆరోగ్యం క్షీణిచింది. అనంతరం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు కన్నుమూశారు.
