నిర్మల్ జిల్లాలోనే ముథోల్ ను స్వచ్ఛ ముథోల్ గా తీర్చిదిద్దుకుందామని సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ అన్నారు. గ్రామంలో చెత్తాచెదారం, బయటవేయకుండా పరిసరాల పరిశుభ్రతను పాటించి స్వచ్ఛ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుకుందామని చెత్త సేకరణ కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్ ను ముథోల్ గ్రామ పంచాయతీ ఆవరణలో పూజచేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజేందర్ మాట్లాడుతూ ట్రాక్టర్ ను ఉపయోగించి గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ శివ కృష్ణ, ఎంపీటీసీ సభ్యుడు భూమేష్, ఉప సర్పంచి సంజీవ్ ఈఓ రాహుల్, ఎంపీఓ తిరుపతి రెడ్డి, ఏపీఓ శిరీషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.