తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ సోమవారం ఖరారైంది. ఈ నెల 9వ తేదీ నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ల నమోదుకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈ నెల 12 నుంచి 18 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించనున్నారు. ఈ నెల 12 నుంచి 20 వరకు ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది. 22న మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయించనున్నారు. 29 నుంచి ఎంసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగనుంది. 30న తుది విడత ధ్రువపత్రాల పరిశీలిస్తారు. 30, 31 తేదీల్లో తుది విడుత ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. నవంబర్‌ 2న ఇంజినీరింగ్‌ తుది విడుత సీట్ల కేటాయించనున్నారు. 4న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలను అధికారులు విడుదల చేయనున్నారు. కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఏడాది ఎం సెట్‌ నిర్వహణ ఆలస్యమైంది. గత సెప్టెంబర్‌లో నాలుగు రోజుల పాటు రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించారు. తెలంగాణ, ఏపీలో 102 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 1లక్ష43 వేల165 మంది ప‌రీక్షకు దరఖాస్తు చేశారు.