ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా పెనుమత్స సురేష్, జకీయా ఖానుమ్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. శాసన మండలి చైర్మన్ షరీఫ్ నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, అంజాద్ భాషా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పల నాయుడు, జోగి రమేష్ హాజరయ్యారు.
