తెలంగాణలో రేపు కొవిడ్‌ అభ్యర్థులకు ఎంసెట్‌ పరీక్ష

కరోనా కారణంగా హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు తెలంగాణలో రేపు ప్రత్యేక ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌) నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 8న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎల్బీనగర్‌లోని ఐవోఎన్‌ డిజిటల్‌ ఐడీజెడ్‌లో పరీక్షలు నిర్వహిస్తామని కన్వీనర్‌ గోవర్థన్‌ తెలిపారు. అభ్యర్థులు మధ్యాహ్నం 12.30 కల్లా సెంటర్లకు చేరుకోవాలన్నారు. అభ్యర్థులు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు కరోనా పాజిటీవ్‌ వచ్చినట్లు ధ్రువీకరించే రిపోర్టులతోపాటు ఆ తర్వాత నెగెటివ్‌ రిపోర్టులను సమర్పించాలన్నారు.