భారత్‌లో కొత్తగా 72,049 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డు స్థాయిలో 72,049 కరోనా పాజిటివ్ కేసులు, 986 మరణాలు నమోదయ్యాయి. మొత్తం 82,203 మంది ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది. 

దేశంలో ఇప్పటివరకు 67,57,132 పాజిటివ్‌ కేసులు నమోదవగా యాక్టివ్‌ కేసులు 9,07,883. డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 57,44,693. ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి మొత్తం 1,04,555 మంది మృతి చెందారు.  దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 85.02 శాతంగా ఉంది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 13.44. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు  8,22,71,654  కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.